Today Telugu Horoscope: ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది

Published on Thu, 11/23/2023 - 05:20

శ్రీ శోభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ఏకాదశి రా.10.22 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.24 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: తె.4.43 నుండి 6.13  వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు, అమృత ఘడియలు: ప.12.54 నుండి 2.24 వరకు, ప్రబోధనైకాదశి; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.12, సూర్యాస్తమయం: 5.20. 

మేషం... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు  కృషి చేసినా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు.

వృషభం... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. 

మిథునం.... కొత్త పనులకు శ్రీకారం. వస్తులాభాలు. విందువినోదాలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి.  వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి.

కర్కాటకం... బంధువిరోధాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కళాకారులకు ఒత్తిడులు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆరోగ్యభంగం. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపించదు.

సింహం.... కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి.

కన్య.... పరపతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వస్తులాభాలు.

తుల.... దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు... రుణదాతల ఒత్తిడులు.  ఆకస్మిక ప్రయణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.కళాకారులకు నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.

మకరం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.

కుంభం... బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కుటుంబసభ్యులనుంచి ఒత్తిడులు.

మీనం... ఉద్యోగలాభం. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)