Breaking News

అప్పు చేయాల్సిన అవసరమే లేదు 

Published on Mon, 02/12/2024 - 05:39

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

అప్పు చేయాల్సిన అవసరమే లేదు 
మా కుటుంబం వ్యవసాయంపై ఆధార­పడి జీవిస్తోంది. నాకు ఒకటిన్నర ఎక­రాల పొలం ఉంది.  అనకాపల్లి జిల్లా నర్సీ­పట్నం మండలం యరకన్నపాలెంలోని మా పొలాల  పక్కనే తాండవ జలాశయం కాలువ పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. నీటి వసతి ఉండటంతో   ఏటా వరి పంట వేస్తుంటాం.  30 సెంట్లలో జీడిమామిడి తోట ఉంది. మిగిలిన ఎకరా 20 సెంట్లలో వరి పంట వేశాను. జీడి తోట సంవరక్షణ, వరికి నాట్ల దగ్గర నుంచి   కోతకోసే వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుంది.

ఈ ప్రభు­త్వం రాకమునుపు  వ్యవసాయ పెట్టుబడికి అప్పు­చేయాల్సి వచ్చేది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున వస్తుండటంతో పెట్టుబ­డికి ఇబ్బంది లేదు. వరి పంట కోత దశకు వచ్చింది. ఈ సమయంలో రైతు భరోసా కింద రూ. 4 వేలు పడింది. ఈ డబ్బు కోత పనులకు ఉపయోగపడుతుంది. నా భార్య రామలక్ష్మి కి వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.13 వేలు వచ్చింది.  గుంటూరు ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న నా కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.55 వేల వంతున వచ్చింది.

గుడ్ల వల్లేరు ఏఏఎన్‌ఎం కాలేజీలో డిప్లమా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మా అమ్మాయి శ్రావణికి ఏటా రూ.25 వేల వంతున వచ్చింది.  జగనన్న ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా   ఇద్దరు బిడ్డలను ప్రైవేటు కళాశాలలో చదివించుకుంటున్నాను. అప్పు కోసం తిరగాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు మరువలేను.    – రుత్తల సాంబశివరావు, రైతు, యరకన్నపాలెం  (ఏనుకూరి అప్పారావు, విలేకరి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా)

సొంతిల్లు కల్పించిన జగనే మా దేవుడు
మా సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మి­గనూరు. ఆర్‌ఎంపీగా జీవనం సాగి­స్తున్నాను. 26 ఏళ్ల కిందట  ఉపాధి కోసం అనంతపురం జిల్లాకు వలస వచ్చా. నాకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.  ఉరవకొండ, విడపనకల్లు, అనంతపురం రూర­ల్‌ మండలం కందుకూరు తదితర ప్రాంతాల్లో పనిచేశా. ప్రస్తుతం కందుకూరు గ్రామంలో  స్థిర­పడ్డా.  పిల్లలు పెద్దయ్యేకొద్ది ఖర్చులు పెరుగు­తూ వచ్చాయి. వచ్చే సంపాదనంతా ఇంటి అద్దెలు, కుటుంబ నిర్వహణకే సరిపోయేది.  సొంతగూడు కట్టుకోవాలని కలలు కనేవాడిని.  ప్రతీరోజూ ఆ దేవుడ్ని మొక్కుకునేవాడిని. బాడుగ డబ్బు చెల్లించడంలో కాస్తా ఆలస్యమైతే చాలు ఇల్లు ఖాళీ చేయమనేవారు.

ఇంతకుముందు ఎక్కడా అరసెంటు కూడా లబ్ధి పొందలేదు. మహానుభావుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కందుకూరు జగనన్న లే అవుట్‌లో సెంటున్నర స్థలం ఇచ్చా­రు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 లక్షల దాకా ఉంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేయడంతో ఇల్లుకూడా నిర్మించుకున్నా. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసే­శా. నా కొడుకుకు సచివాలయ ఉద్యోగం వచ్చింది. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా అనంతపురంలో పనిచేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేమి కావాలి?  అందుకే నా ఇంట్లో దేవుని గూటిలో మా నాయన ఫొటో పెట్టుకోలేదు కాని వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టుకుని పూజిస్తున్నా.     –  సీహెచ్‌ గోవిందరెడ్డి, కందుకూరు   (రిపోర్టర్‌: బొడ్డు నగేష్, అనంతపురం ఎడ్యుకేషన్‌)

వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే పోషిస్తోంది
నేను వృద్ధురాలిని..ఒంటరి మహిళను. కృష్ణాజిల్లా బాపు­లపాడు మండలం బాపు­ల­పాడులో వ్యవసాయ కూలీగా జీవనం సాగి­స్తు­న్నా­ను. రెక్కా­డితే కాని డొక్కాడని జీవితం నాది. వయోభారంతో కూలీ పనులు చేసే ఓపిక లేకపోవటంతో బతుకు భారంగా మారింది. ఆదాయం లేకపోవటంతో డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించటం కష్టంగా మారింది.  ఇలాంటి తరుణంలో అధి­కారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నన్ను భగవంతుడిలా ఆదుకుంది. ఈ ప్రభు­త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మనో­ధైర్యాన్ని ఇచ్చాయి.   వైఎస్సార్‌ చేయూత,  ఆసరా, రైతు భరోసా, వైఎస్సార్‌ ఫించన్‌ కానుక పథకాలతో  పెద్ద కొడుకుగా జగన్‌ నన్ను ఆదుకున్నాడు.

వృద్ధాప్య ఫించన్‌తో పాటు ఏటా నాలుగు సంక్షేమ పథకాల ద్వారా  బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. ప్రతి నెల ఒకటో తేదీనే వలంటీర్‌ ఇంటికి వచ్చి నాకు రూ.3 వేలు వృద్దాప్య పింఛన్‌ అందిస్తు­న్నారు.  ఆసరా పథకం క్రింద రూ.30 వేలు డ్వాక్రా రుణ­మాఫీ చేశారు.  వైఎస్సార్‌ చేయూ­త కింద ఏటా రూ.18,750, రైతు భరోసా కింద ఏటా  రూ.13,500  అందుతున్నాయి.

దీంతో ఎవ్వరిపైనా ఆధార పడకుండా ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు నెలకు సరిపడా అందిస్తున్నారు. జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.    – జోగి లక్ష్మి, బాపులపాడు చలమలశెట్టి శ్యామ్, విలేకరి, హనుమాన్‌జంక్షన్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)