Breaking News

కొడుకులా ఆదుకున్నారు

Published on Tue, 01/30/2024 - 05:45

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

యాచన మాని గౌరవంగా బతుకుతున్నా..
మాది పేద కుటుంబం. విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ దళితవాడలో నేను, మా ఆయన కూలి పనులు చేసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు ఆడపి­ల్లలు. వాళ్లు చిన్న వయసులో ఉన్నçప్పుడే మా ఆయన చనిపో­యారు. ఆయన వారసత్వంగా వచ్చిన అర­కొర ఆస్తితో వాళ్లను పెంచి, పెద్దచేసి పెళ్లుళ్లు చేశాను. వాళ్లకు భారం కాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు తెరువుకోసం యాచన ప్రారంభించా.

అప్పట్లో పింఛన్‌ వచ్చినా.. ఏ మూలకూ సరిపోయే­దికాదు. దానికోసం కూడా ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. పడిగాపులు పడాల్సిన దుస్థితి. నాలు­గేళ్ల కిందటి వరకు సిగ్గు విడిచి చుట్టుపక్కల గుడులు, గోపురాల ముంగిట యాచించేదాన్ని. వచ్చిన చిల్లరతో బతికే­దాన్ని. జగన్‌బాబు వచ్చాక పింఛన్‌ పెంచారు. ఇంటికే వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. ఇప్పు­డు రూ.3 వేలకు పెంచారు. పొదుపు సంఘాల్లో ఉన్న మా కూతుళ్లు ఇద్దరూ వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథ­కాల ద్వారా అందుతున్న సొమ్ము­తో కూరగా­యలు అమ్ము­కొని బతుకున్నారు. ప్రభు­త్వం ఇస్తున్న అమ్మ ఒడి సాయంతో మనవరాళ్లు స్కూళ్లలో ఇంగ్లిష్‌ చదువులు చదువుతున్నారు. జగన్‌­బాబు ఇచ్చిన పింఛన్‌తో యాచన మానుకొని గౌరవంగా బతుకుతున్నాను.      – బత్తిన అప్పమ్మ, వాడాడ (గొట్టాపు త్రినాథరావు, విలేకరి, విజయనగరం అర్బన్‌)

నిలదొక్కుకుంటున్నాం..
రెక్కాడితే గానీ డొక్కాడని  బతుకులు మావి. నేను, మా ఆయన ఏడేళ్ల క్రితం వరకు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా పనులు చేసుకుంటూ కుటుం­­బాన్ని పోషించుకునే వాళ్లం. మాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. మా స్వగ్రా­మమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛా­పురం మండలం అరక­బ­ద్రకు వచ్చిన తర్వాత బతుకు భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేయాలని అను­కున్నాం.

నేను స్వయం శక్తి సంఘంలో సభ్యు­రాలిగా ఉండటంతో మూడేళ్ల క్రితం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నా. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా లభించిన రూ.36 వేలతో నేను, నా భర్త కలిసి హోటల్‌ ప్రారంభించాం. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్తకు, నాకు తీవ్ర గాయాలు కావడంతో హోటల్‌ మూతబడింది. ఏడా­ది నుంచి ఆర్థికంగా ఇబ్బం­దులు పడుతున్న సమయంలో మరో­మారు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు, వైఎస్సార్‌ చే­యూ­త పథకం ద్వారా రూ.18,750 వంతున రెండు విడతలుగా అందిన సొమ్ముతో రెండు ఆవులను కొనుగోలు చేశాం. ఇప్పుడు వాటి పాలను రోజు వారీ అమ్ముతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. మా జీవితానికి ఢోకా లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాకే మా లాంటి పేదలంతా హాయిగా జీవనం సాగిస్తున్నారు.     – పొట్నూరు గీత, అరకబద్ర (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్‌)

కొడుకులా ఆదుకున్నారు
పిల్లలు లేని మాకు వృద్ధాప్యంలో ఈ ప్రభు­త్వమే అండగా నిలిచింది. మాది శ్రీకాకు­ళం. వయసు మీద పడడంతో ఏపనీ చేయలేని స్థితిలో నా భార్య లక్ష్మితో కలిసి ఆరేళ్ల క్రితం విశాఖ వచ్చాము. ఇక్కడ ఆరిలోవ ఆపరే­షన్‌కాలనీలో మా సమీప బంధువు కల్యాణి ఇంట్లో ఉంటున్నాం. ఆమె మమ్మల్ని ఆదరాభిమా­నంతో చూసుకుంటోంది. ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. ఈ నెల నుంచి పింఛను డబ్బులు పెరిగాయని వలంటీరు లీలాకృష్ణ మా ఇంటికి వచ్చి రూ.3 వేలు అందించారు. మాకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.

మా ఇద్దరికీ కంటి చూపు మందగించడంతో ఇబ్బంది పడేవాళ్లం. గత నెల 21న ఆరిలోవలో జగనన్న కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి వెళ్లి్న మాకు పరీ­క్షలు చేసిన డాక్టరు ఆపరేషన్‌ చేయాలని చెప్పా­రు. అదే నెల 23న మా ఇద్దరికీ కంటి ఆపరేషన్‌ ఉచితంగా చేశారు. దీంతో పాటు నా భార్య లక్ష్మికి చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వచ్చింది. మూడేళ్ల క్రితం ఆమెకు పొట్టలో భరించరాని నొప్పి రావ­డంతో కేజీహెచ్‌లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేశా­రు. అనేక విధాలుగా సహాయం అందిస్తూ పిల్ల­లు­లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదు­కుంటున్నారు.      – రోణంకి చిరంజీవులు, విశాఖ (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)