Breaking News

మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు

Published on Thu, 01/18/2024 - 02:48

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు
మాది చాలా పేద కుటుంబం. నా వయసు 66 సంవత్సరాలు. విశాఖపట్నం మురళీనగర్‌లోని ఎన్‌జీవోస్‌ కాలనీలో ఉంటున్నాము. నేను గతంలో రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించే వాడిని. నాకు ఐదారేళ్ల కిందట కీళ్ల సమస్య రావడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. మంచాన పడ్డ నన్ను ఎవరైనా లేవదీసి కూర్చోబెట్టినా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. గత ప్రభుత్వంలో పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు.

ఈ ప్రభుత్వం వచ్చాక నా దీనస్థితిని తెలుసుకున్న వలంటీర్‌ ఇంటికి వచ్చి మరీ పింఛన్‌కు దరఖాస్తు చే­యించారు. వెంటనే మంజూరైంది. ప్రస్తుతం నాకు ప్రతి నెలా ఒకటో తారీఖునే పింఛను వస్తోంది. ఈ నెల నుంచి రూ.3 వేలు ఇస్తు­న్నారు. ఈ సొమ్ము మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది. నా భార్య నారాయణమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ కుంటుంబానికి చేదోడుగా ఉంటోంది. పెళ్లీడుకు వచ్చిన కూతురు మంగమ్మ ఉంది. మాకు ఆర్థిక స్తోమత లేక, ఆమె మానసిక పరిస్థితి బాగోలేక పెళ్లి చేయలేకపోయాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చింది. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకోగలుగుతున్నాం. రేషన్‌ కార్డుపై ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. మా లాంటి వారి కోసం శ్రద్ధ తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.  – గుమ్మిడి కనకం, విశాఖపట్నం (కసిరెడ్డి సూర్యకుమారి వెంకట్, విలేకరి, మురళీనగర్‌)

పేదల ప్రాణానికి పెద్ద దన్ను
ఆటోయే మా జీవనాధారం. మన్యం జిల్లా పార్వతీపురంలో నేను ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు నా భార్య టైలరింగ్‌ చేయడం ద్వారా కొంత సంపా­దిస్తోంది. దాంతో కుటుంబాన్ని గుట్టుగా పో­షించుకుంటున్నాం. వచ్చిన ఆదాయంలోనే ఒక­వైపు ఇన్సూరెన్స్, వివిధ మరమ్మతు పను­లు వంటివి కూడా చేసుకోవాలి. మిగిలిన దాంతో జీవించాలి. ఇంతలో పులిమీద పుట్రలా 2019లో ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాను.

గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపో­యి­నట్లు గుర్తించారు. బైపాస్‌ సర్జరీ తప్పనిసరిగా చేయా­లని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న నాకు సర్జరీ అంటే భయం వేసింది. ఇక బతకనేమోనన్న భయం పట్టుకుంది. నా కుటుంబం గురించి ఆలోచించే సరికి ప్రాణం విలవిలలాడింది. ఆ సమయంలో స్నే­హితుల సలహాతో విశాఖ మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లగా.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ఏడాదికి సరిపడా మందులు ఇచ్చి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

ఆ సమయంలో కు­టుంబ పోషణ నిమిత్తం రెండు నెలలకు రూ.10,000 అందజేశారు. నెమ్మ­ది­గా కోలుకు­న్నా­ను. ఇప్పుడు మళ్లీ ఆటో నడు­పుకో­గలుగు­తున్నా. ఏటా నాకు వాహన మిత్ర ద్వా­రా రూ.10 వే­లు అందుతోంది. నా కు­మార్తె హి­మబిందు నాలుగో తరగతి చదు­వుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం వర్తించింది. ఏటా రూ.15 వేలు వంతున నా భార్య ఖాతాలో నగదు జమవుతోంది. టైలరింగ్‌ చేస్తుండటం వల్ల ఆమెకు చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. మాకు జగనన్న కా­లనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. ని­ర్మాణం పురోగతిలో ఉంది. మాలాంటి పేద బ­తుకులకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 
– పొందూరు విజయ్‌కుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్‌)

అప్పు చేయకుండా చేపల వ్యాపారం
మేం మత్స్యకారులం. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశు­వుల్లంక గ్రామంలో చేపలతోపాటు ఎండు చేపలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. జగన్‌ వచ్చిన తర్వాత నాకు ఏటా క్రమం తప్పకుండా చేయూత పథకం ద్వారా డబ్బులొస్తున్నాయి. ఏడాదికి రూ.18,750 చొప్పున ఇంత వరకు రూ.56,250 వచ్చింది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నా.

రేవు వద్ద చేపలుకొని మార్కెట్‌లో అమ్ముకుంటున్నా. పెట్టుబడికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని చేపలు కొనుక్కుని, అమ్ముకునే వాళ్లం. లాభం చాలా వరకు వడ్డీలకే వెళ్లిపోయేది. ఇప్పుడు వడ్డీ బాధ లేదు. పేదల కోసం ఆలోచించే వ్యక్తి జగన్‌. అందుకే మా­లాంటి వాళ్లం సంతోషంగా ఉంటున్నాం. వైఎస్సార్‌ ఆసరా కింద రూ.60 వేలు వచ్చింది. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. దీంతో మా కుటుంబం హాయిగా జీవిస్తోంది.   – ఓలేటి మంగాయమ్మ, పశువుల్లంక (డీవీవీ సుబ్బారావు, విలేకరి, ఐ పోలవరం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)