Breaking News

వలస వచ్చినా ఇల్లు ఇచ్చారు

Published on Fri, 01/12/2024 - 04:20

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. 

వలస వచ్చినా ఇల్లు ఇచ్చారు 
13 సంవత్సరాల క్రితం మా మేన మామ తాతారావుతో నా వివాహం జరిగింది. ఆ తర్వాత బతుకుతెరువు కోసం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామానికి వచ్చాం. మా స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నం. నా భర్త కేటరింగ్‌తో పాటు వంట మాస్టర్‌గా పని చేస్తారు. నేను నా భర్తకు ఇంటి దగ్గర కేటరింగ్‌కు అవసరమైన సహాయం చేస్తూ ఇంటి పనులు చూసుకుంటాను. ఈ ప్రాంతంలో సొంతిల్లు లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో ఇరువాడ బీసీ కాలనీలో అద్దెకు ఉండేవాళ్లం.

వచ్చే రూ.9, 10 వేల ఆదాయంలో అద్దెకే రూ.3 వేలు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన సొమ్ముతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో జగనన్న కాలనీలో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకున్నాం. సబ్బవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి రూ.1.80 లక్షలు ఇచ్చారు. మేము మరికొంత డబ్బు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్నాం.

మా కల నెరవేరింది. సొంతింట్లో పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. మాకు జగనన్న ఇచ్చిన స్థలమే బహిరంగ మార్కెట్లో రూ.6 లక్షలకు పైగా పలుకుతుంది. మాకు ఇద్దరు పిల్లలు. బాబు వినయ్‌నాయుడు సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి ఏటా రూ.15,000 వంతున వస్తోంది. పాప జాహ్నవి అదే పాఠశాలలో 4వ తరగతి. మా సొంతింటి కలను నెరవేర్చిన జగనన్నకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.     – పల్లి జానకీదేవీ, ఇరువాడ  (సుర్ల నాగేశ్వరరావు, విలేకరి సబ్బవరం) 

ప్రాణాపాయంలో కొండంత అండ 
అర్చకత్వం నా వృత్తి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మూలిపాడు పంచాయతీ శ్రీనివాసపురంలోని శ్రీబా­లాజీ రఘునాథస్వామి ఆలయ పూజారిగా పని చేస్తున్నా. దానిపై వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నా. నాకు భార్య, ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరూ విశాఖపట్నంలో ప్రైవేటు దుకాణాల్లో పని చేస్తున్నారు. కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపించాం.

ఏదోలా కాలం గడుపుతున్న నాకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.ఆస్పత్రిలో చూపిస్తే ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. పెద్ద మొత్తంతో ఖర్చవుతుందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని గ్రామ పెద్దలు చెప్పడంతో శ్రీకాకుళంలోని జెమ్స్‌ ఆస్పత్రికి వెళ్లాము. అక్కడ ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను.

నా భార్య పంకజ డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ఏటా రూ.15,000 వంతున మూడేళ్లుగా అందింది. గతంలో తీసుకున్న డ్వాక్రా రుణానికి సంబందించి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.18,600 ఆమె ఖాతాలో జమయ్యాయి. మేము హాయిగా జీవిస్తున్నాం.   – రమేష్‌ మహంతి, శ్రీనివాసపురం  (కొంచాటి ఆనందరావు, విలేకరి, మందస)  

అమ్మనాన్నలకు భారం కాకుండా చదువు 
మాది నిరుపేద గిరిజన కుటుంబం. మా నాన్న ఆరిక భాస్కరరావు, అమ్మ కుసుమ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సంతోషపురం గ్రామంలోని కొండపై పోడు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నా చదువు వారికి పెద్ద భారంగా మారింది. ప్రభుత్వం అందించిన అమ్మ ఒడి పథకం ద్వారా ఇంటర్‌ వరకు సులువుగా సాగిపోయింది. డిగ్రీ చదవాలంటే పార్వతీపురం వెళ్లాల్సిందే.

అంత ఖర్చు ఎలా భరించాలో తెలీక అమ్మానాన్న మొదట భయపడ్డారు. మా ఊరి పెద్దల సూచనతో హాస్టల్‌లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలు అందిస్తుందని చెప్పడంతో పార్వతీపురం ఎస్‌వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాను. నాకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.40 వేలు అందింది.

దాంతో అమ్మనాన్నలకు భారం కాకుండా చదువు సాగిపోతోంది. ఇప్పుడు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం. డిగ్రీ పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాను. కొండపోడు వ్యవసాయం చేస్తున్న మా నాన్నకు వైఎస్సార్‌ రైతు భరోసా గతేడాదే వర్తించింది. ఈ ప్రభుత్వం లేకపోయుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం.   – ఆరిక సాయికిరణ్, సంతోషపురం, కురుపాం మండలం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్‌)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)