Breaking News

సమస్యల నుంచి గట్టెక్కించారు 

Published on Tue, 03/05/2024 - 03:33

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

సమస్యల నుంచి గట్టెక్కించారు 
మాది చిన్నకారు రైతు కుటుంబం. మా ఆయన, నేను కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడేవాళ్లం. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం అత్తికొత్తూరు గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని అందులో వ్యవసాయం చేసుకుంటూ ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నాం. ప్రతి ఏటా నష్టాలు చవిచూసేవాళ్లం. కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మహిళలకు అందించే సంక్షేమ పథకాలతో కుటుంబం ఆర్థికంగా స్థిర పడింది. నేను నేర్చుకొన్న టైలరింగ్‌ మమ్ములను ఆదుకుంది.

జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి 10 వేల రూపాయల వంతున సాయం అందింది. ఆ మొత్తంతో బాలేరు సెంటర్‌లో టైలరింగ్‌ షాపు, బట్టల వ్యాపారం పెట్టు­కొన్నా. నాకు వైఎస్సార్‌ ఆసరా కింద నాలుగేళ్లకు రూ. 18 వేలు, మా అత్త నెయ్యిగాపుల వెంకటమ్మకు వైఎస్సార్‌ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వంతున అందడంతో ఆ మొత్తాన్ని బట్టల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాం. మా పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద ఏడాదికి రూ. 15 వేలు వంతున వస్తోంది. మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.     – నెయ్యిగాపుల రమణమ్మ, అత్తికొత్తూరు (టంకాల మోహనరావు, విలేకరి, భామిని) 

మా బిడ్డకు ప్రాణం పోశారు 
మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. మా ఇంటాయన వెంకటేష్‌ నాయక్‌ తాపీ పనులు చేస్తుంటారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన మాకు రాజునాయక్‌(14), ప్రణీత బాయి(8) అనే ఇద్దరు పిల్లలున్నారు. మా అబ్బాయి పుట్టిన ఆరు నెలలకే అస్వస్థతకు గురవ్వడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ప్రతి 20 రోజులకోసారి రక్తం ఎక్కించాలన్నారు. పూట గడవటమే కష్టంగా ఉన్న మాకు వైద్యం చేయించడం కత్తిమీద సాములా మారింది. ఒక్కసారి రక్తం ఎక్కించడానికి రూ.6 వేలు, టాబ్లెట్స్‌కి మరో రూ.4 వేలు ఖర్చయ్యేది. బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వారు ముఖం చాటేసేవారు.

గత ప్రభుత్వం స్పందించకపోవడంతో దాతల సాయంతో హైదరాబాద్, గుంటూరులో తొమ్మిదేళ్లు వైద్యం చేయించాం. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తలసేమియాతో బాధ పడుతున్న మా అబ్బాయికి నెలకు రూ.10 వేలు పింఛను మంజూరు చేశారు. గుంటూరు, నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం చేయించడంతో పాటు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5 వేలు విలువ చేసే మందులు కూడా ఇస్తున్నారు. దీంతో అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. మా అబ్బాయికి బోన్‌మ్యారో శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. దీనికి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రభుత్వంలోనే ఆ చికిత్స కూడా జరుగుతుందని ఆశిస్తున్నా. మా అబ్బాయిని ఆదుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.    – భూలక్ష్మీబాయి, శ్రీనగర్‌ (వినుకొండ అజయ్‌కుమార్, విలేకరి, దాచేపల్లి) 

చింత తీరి హాయిగా జీవిస్తున్నాం 
మాది చేనేత కుటుంబం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉంటున్న మేము ఇంటిల్లిపాదీ కష్టపడినా రోజువారీ జీవనమే కష్టమయ్యేది. ఏ ప్రభుత్వం కూడా మమ్ములను ఆదుకోలేదు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకుల్లో మార్పులు వచ్చాయి. మా వృత్తికి సరైన గుర్తింపు లభించడంతోపాటు సంక్షేమ పథకాలతో పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందుతోంది. నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందింది.

మా అమ్మ పద్మావతికి నెలకు రూ.3 వేల పింఛన్‌తో పాటు వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధి చేకూరింది. జగనన్న లే అవుట్‌లో రూ.5 లక్షల విలువ చేసే స్థలంతో పాటు పక్కా గృహం కూడా మంజూరైంది. ఇటీవలే నా భార్య చూపు మందగించింది. ఆమెను జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. మమ్ములను ఇంత గొప్పగా ఆందుకుంటున్న జగనన్నకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం.   – నున్నా సురేష్, ఉరవకొండ  (బళ్లారి సాదిక్, విలేకరి, ఉరవకొండ) 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)