Breaking News

బాధితులకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం

Published on Wed, 03/13/2024 - 05:24

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా.. వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ  నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య­మంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికా­రులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బాధితులు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, సీఎం చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పు­కున్న వెంటనే అర్థం చేసుకొని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు.  

సహాయం అందుకున్న వారు..
►  విస్సన్నపేట మండలం, నరసాపురం గ్రామా­నికి చెందిన ఎస్‌.లక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు భానుతేజ కేన్సర్‌తో బాధపడుతున్నాడని.. చికిత్స అవస­రాల నిమిత్తం సాయం చేయాలంటూ  ముఖ్య­మంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు.

►  విజయవాడ, అజిత్‌సింగ్‌ నగర్‌కు చెందిన 31 ఏళ్ల కంబా ఏడుకొండలు.. ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్య­మంత్రికి విజ్ఞప్తి చేయగా రూ.2 లక్షలు సహాయాన్ని అందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)