Breaking News

ఐటీ హబ్‌గా విశాఖ

Published on Thu, 09/14/2023 - 03:37

సాక్షి, విశాఖపట్నం: ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందనుందని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ త్వరలోనే విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. వైఎస్సార్‌ హయాంలో విశాఖలో ఐటీకీ జీవం పోస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రశంసించారు.

ఎండాడ సమీపంలో ఐటీ సెజ్‌ హిల్‌ నంబర్‌–2లో ఇన్ఫోసిస్‌ సంస్థ ఏర్పాటు కానున్న నూతన భవనాన్ని బుధవారం ఇన్ఫోసిస్‌ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం ఇన్ఫోసిస్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

సమావేశంలో ఇన్ఫోసిస్‌ సంస్థ మౌలిక సదుపాయాల విభాగం వైస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ హెడ్‌ నీలాద్రి ప్రసాద్‌మిశ్రా, మౌలిక సదుపాయాల అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ దేశాయ్, మౌలిక సదుపాయాల రీజినల్‌ హెడ్‌ కులకర్ణి, సంస్థ ఇతర ప్రతినిధులు జయచంద్రన్, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ప్రారంభోత్సవ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఉన్నారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)