Breaking News

రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత

Published on Thu, 12/28/2023 - 16:46

సాక్షి, అన్నమయ్య జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ  బస్సు యాత్రలో పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం రింగ్‌రోడ్డు నుంచి బంగ్లా వరకు  ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు.

బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం: అంజాద్‌ బాషా
డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు.. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు.

మైనార్టీని మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను శాసన మండలి డిప్యూటి ఛైర్మన్‌ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమౌవుతుంది. అందరిని నా వాళ్లు అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చెందింది. రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది’’ అని  అంజాద్‌ బాష ప్రశంసించారు.

రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఏకమవుతున్నాయి. అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. 175 స్దానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.

ఇదీ సీఎం జగన్ పాలన ఘనత: ఎంపీ సురేష్‌
వైఎస్సార్‌ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్‌సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి  జగన్’’ అని ఎంపీ సురేష్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)