అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
Published on Fri, 06/06/2025 - 19:16
తాడేపల్లి : ముస్లిం సోదర, సోదరీమణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు.
ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidUlAdha
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025
Tags : 1