Breaking News

పోలవరం ఎత్తు తగ్గింపు వద్దు: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి

Published on Mon, 02/03/2025 - 19:03

సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3)  రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు  గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 

135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్‌కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలి

సూపర్‌సిక్స్‌ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..

ఏపీలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్నారు.

ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్‌సిక్స్‌ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని  ఏర్పాటు చేయాలి.

వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి  ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్‌లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

  • ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలి
  • రైతులను ఆదుకునేందుకు నాడు  వైఎస్ జగన్‌ 11 పథకాలు అమలు చేశారు
  • ఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది
  • రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది
  • ఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు
  • నా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండి
  • రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా  సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు
  • చంద్రబోస్‌ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)