Breaking News

AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’

Published on Sun, 06/08/2025 - 19:15

నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.  నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌కు రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్‌లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్‌ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్‌ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్‌లైన్ బదిలీ అప్షన్స్‌ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

టీచర్లను ఎలా మోసం చేశారంటే...
టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్‌లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్‌వల్‌కు బదులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్‌వల్‌ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. 

గత మే నెలలో ఆన్‌లైన్‌ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్‌లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్‌లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.

బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తం
గత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్‌ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్‌లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. 

తొమ్మిదిరకాల స్కూల్స్‌గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్‌ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్‌ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్‌ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. 

కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్‌ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్‌ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్‌లు సర్‌ప్లస్‌గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్‌కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్‌ను కూడా పీఎస్ హెచ్‌ఎంగా మోడల్ స్కూల్స్‌కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్‌జీటీలకు పీఎస్ హెచ్‌ఎం పదోన్నతి రాకుండా పోయింది.

పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయింది
మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్‌ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్‌లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. 

నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్‌లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్‌ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)