Breaking News

‘ఐపీఎస్‌ ఆఫీసర్‌ని రేయ్‌ అంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?’

Published on Tue, 07/22/2025 - 12:40

తాడేపల్లి:  ఐపీఎస్‌ ఆఫీసర్ని రేయ్‌ అంటూ సంబోధించిన తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్, టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు.  ఈరోజు(మంగళవారం, జూలై 22) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఉద్యోగులు, అధికారులను జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు. తన సొంత రాజ్యాంగాన్ని అధికారులపై జేసీ ప్రదర్శిస్తానంటే కుదరదు. 

ఐపీఎస్ ఆఫీసర్‌ని సైతం రేయ్ అంటూ సంబోధించడం మంచి పద్దతి కాదు. నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తానంటూ బెదిరించటం ఏంటి?. ఉద్యోగుల గౌరవం కాపాడుతానన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు?, జేసీ ప్రభాకరరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. జేసీ వలన ఏ అధికారి, ఉద్యోగి కూడా ప్రశాంతంగా పని చేయలేకపోతున్నారు. నీతి, నిజాయితీలతో పని చేసే ఆఫీసర్లని ఇష్టం వచ్చినట్లు బెదిరిస్తారా?, టీడీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. హిందూపురంలో పారిశుధ్య కార్మికురాలిపై సైతం టీడీపీ నేత వేధింపులకు పాల్పడ్డాడు. ఇలాంటి వారందరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.  లేకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉద్యోగుల పక్షాన ఆందోళన చేస్తాం

కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి నోరుపారేసుకున్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడారు. ‘మాకు ఒక ఏఎస్పీ వచ్చారు. మొదట్లో డీఎస్పీ చైతన్య బాగున్నాడు. తరువాత చెడిపోయినాడు. ఇప్పుడు ఒక ఏఎస్పీ ఉన్నారు. ఈయన మరో చైతన్యలా తయారయ్యారు.

ఈయన వచ్చినప్పటి నుంచే మొదలుపెట్టాడు. పోలీసు బందోబస్తు పెట్టి టవర్‌ నిర్మిస్తావా?  వైఎస్సార్‌సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నావ్‌.. ఎంత ముట్టింది నీకు? ఏం తెలుసు నీకు .. ఐదేళ్లు కష్టపడ్డాం రోయ్‌.. బస్సులు పోయినాయి.. అన్నీ పోయినాయి.. నువ్వు న్యాయం చేస్తావా..రా.. బుధవారం నీ పోలీసోళ్లు.. నువ్వు రా.. మా రైతాంగం ముందు ఉంటుంది. బుధవారం ఏఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేస్తాం. నీ చేతనైతే అడ్డుకో... పోలీస్‌ పవర్‌ ఏందో చూపించు’ అని పళ్లు కొరుకుతూ ఊగిపోయారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)