Breaking News

క్రికెటర్ కేఎస్ భరత్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Published on Sat, 06/06/2026 - 19:10

తాడేపల్లి:  రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి..  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఏపీకి చెందిన బ్యాటర్‌-వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న భరత్‌కు శుభాకాంక్షలు అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  ఆల్‌ ది బెస్ట్‌ కేఎస్‌ భరత్‌ అంటూ పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్.. గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్‌, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు భరత్‌,.
 

 

 కాగా, 2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.

అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భరత్‌ 82 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్‌లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో భరత్‌ 11 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)