Breaking News

చిరస్మరణీయుడు వైఎస్సార్‌

Published on Mon, 12/22/2025 - 04:45

యానాం:  ప్రజా సంక్షేమంపై అంకిత భావం ఉన్న నాయకుడిగా, పేదల పరిరక్షకుడిగా, రైతుల్ని కాపాడే నేతగా, సేవాభావంతో అందరి హృదయాలపై చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని పలువురు నేతలు అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ స్మృతి మందిరాన్ని ఆదివారం ప్రారంభించారు. 

ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సుమారు రూ.2 కోట్ల సొంత నిధులతో దీనిని నిర్మించారు. ఈ మందిరం ప్రారంభం సందర్భంగా మల్లాడి రచించిన ‘ఆత్మీయులు రాజన్న స్మృతిలో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మల్లాడి మాట్లాడుతూ.. యానాం నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్‌ అందించిన సహాయ సహకారాలను గుర్తు చేశారు. 

కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, నాయకులు కేవీపీ రామచంద్రరావు,చిన్నారెడ్డి, విజయసాయిరెడ్డి, పల్లంరాజు, రఘువీరారెడ్డి, కొణతాల రామకృష్ణ, గిడుగు రుద్రరాజు,ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)