Breaking News

‘నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను.. మీరు చాలా సాయం చేశారు’

Published on Mon, 06/26/2023 - 13:09

సాక్షి, తాడేపల్లి:  ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్‌ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌తో వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన న్యాయవాదులు ఏమన్నారంటే, వారి మాటల్లోనే

సార్, నమస్కారం, నేను గుంటూరు బార్ ఆసోసియేషన్ లో జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయాను, మా బాబాయి కూలీ పనులు చేస్తూ తన పిల్లలతో పాటు చదివించారు, నేను లా చదువుతాననగానే ఒప్పుకుని లా చదివించారు, చదువు పూర్తవగానే గుంటూరు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు, స్పందనలో అప్లికేషన్ పెట్టగానే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అకామిడేషన్ ఇప్పించారు, మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి వస్తుంది,

విద్యా కానుక వస్తుంది, మా తమ్ముడికి విద్యా దీవెన వస్తుంది, పిన్నికి చేయూత వస్తుంది, నేనే కాదు కుటుంబ సభ్యులు అందరూ మీ పథకాలు పొందుతున్నారు, నేను లా పూర్తి చేయడానికి మీరు చాలా సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను, ఇలాంటి మంచి పాలన ఉంటుందనుకోలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను, మీ స్పూర్తితో నేను పేదలకు న్యాయం విషయంలో సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను, థ్యాంక్యూ సార్. 
-రత్న కుమారి, న్యాయవాది, గుంటూరు

సార్, నేను 2020 నుంచి జూనియర్ అడ్వకేట్ గా బెజవాడ బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ ప్రారంభించాను, చిన్నప్పటి నుంచి ఈ వృత్తి అంటే ప్రేమ, ఇష్టం, దీనికి మా కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన చెందారు, కానీ నేను లా ప్రాక్టీస్ ప్రారంభించేసరికి మీరు అధికారంలోకి రావడం, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వకేట్స్ లబ్ధిపొందుతున్నారు. నేను ఈ పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి శాంక్షన్ చేశారు, మా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, మీరు ఇస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది, నాలాగా లబ్ధిపొందుతున్న వారందరి తరపునా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్, మా అడ్వకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది, ధ్యాంక్యూ సార్.
-అరవింద్, అడ్వకేట్, విజయవాడ
 

చదవండి:  ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు: సీఎం జగన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)