Breaking News

గనుల లీజులపై గలీజు మాటలు

Published on Sat, 07/27/2024 - 06:00

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గనుల లీజుల గురించి ఇష్టానుసారం మాట్లాడు­తు­న్నారని సీఎం చంద్ర­బాబు­నాయుడుపై వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజ­­మెత్తారు. మాట్లాడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై లేనిపోని అభాండాలు వేయడా­నికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వాళ్ల కుటుంబాన్ని ఏదో విధంగా తొక్కేయాలి.. వాళ్లను నాశనం చేయాలి.. అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని చెప్పారు. ఇసుక, గనుల పాలసీపై చంద్రబాబు విడుదల చేసిన వైట్‌ పేపర్‌పై వైఎస్‌ జగన్‌ ఫ్యాక్ట్‌ పేపర్‌ ద్వారా వాస్తవాలను శుక్రవారం మీడియాకు వివరించారు. 

దశాబ్దాలుగా ఈ గనులను అడ్డం పెట్టుకొని సంపాదించింది ఎవరో అందరికి తెలుసన్నారు. మైనర్, మేజర్‌ ఖనిజాల ద్వారా 2018–19లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2,210 కోట్లని తెలిపారు. ఈ రోజు (2023–24) వస్తోన్న ఆదాయం రూ.4 వేల కోట్లకు పైమాటే అని స్పష్టం చేశారు. 2018–19లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏపీఎండీసీ ఆదాయం రూ.400 కోట్లు అని, ఈ రోజు దాని ఆదాయం రూ.3 వేల కోట్లు పైమాటేనని తెలిపారు. 

ఇలా ఆదా­యం పెంచితే కరప్షన్‌ జరుగుతున్నట్టా? అని నిలదీశారు. చంద్ర­బాబు హయాంలో ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఏదైనా ఆరోపణ చేసే ముందు లాజిక్, రీజన్‌ ఉండాలని హితవు పలి­కారు. ఇప్పుడు వైట్‌ పేపర్‌ అంటూ పచ్చి అబద్ధాలు చెబు­తున్నారని మండిపడ్డారు. ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించాలని కోరారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)