Breaking News

కష్టకాలంలో కదిలొచ్చే మనసు

Published on Thu, 06/11/2026 - 08:43

సాక్షి, విశాఖపట్నం:  రాజకీయాలు మారవచ్చు, అధికారం చేయి మారవచ్చు..కానీ మనసు మారదు. పేద కార్మికుని కన్నీటి ముందు ఆర్థ్రతగా కరిగే మనసుకు అధికారం అక్కరలేదు. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి అది నిరూపించారు. స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం యావత్‌ రాష్ట్రాన్ని కలచివేసింది. 1600 డిగ్రీల మరుగుతున్న ఉక్కు ప్రవాహంలో తొమ్మిది మంది కార్మికులు దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. 

ఆ వేదన విన్న మరుక్షణమే జగన్‌ మనసు అటు పరిగెత్తింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. అంతటితో ఆగిపోలేదు..బుధవారం స్వయంగా విశాఖ వచ్చారు. సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. 

ప్రతిపక్షంలోనూ అదే సంస్కారం 
అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పరిగెత్తడం అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బాధితుల వద్దకు వెళ్లే నాయకులు చాలా అరుదు. జగన్‌ ఆ అరుదైన వారిలో ఒకరు. స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువమంది సాధారణ కారి్మకులే. భారతీయ ఉక్కు సంస్థకు కాంట్రాక్ట్‌ కింద పనిచేసే వారు. వారి కుటుంబాలకు తక్షణ పరిహారం అందాలని, న్యాయం జరిగేంత వరకూ బాధితుల తరఫున పోరాడతామన్నారు. ఆత్మీయంగా మాట్లాడుతూ కొండంత భరోసా కల్పించారు. నేనున్నానంటూ కన్నీళ్లు తుడిచారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)