Breaking News

అద్దేపల్లిలో వైఎస్సార్‌ విగ్రహం పునఃప్రతిష్ట

Published on Mon, 07/01/2024 - 03:41

భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.

ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్‌ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడు­గంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు.  వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్‌బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ నిమ్మరసం ఇచ్చి అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేశారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)