Breaking News

ఇంజినీరింగ్‌ కళాశాలపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు తొలగింపు

Published on Fri, 02/20/2026 - 05:59

ఏఎన్‌యూ (పెదకాకాని): ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు అనుసరిస్తున్న విధానాలు విద్యావేత్తలు, మేధావులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం నాడు వర్సిటీలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు.. నేడు ఇంజినీరింగ్‌ కళాశాలపై ఉన్న మహానేత పేరును తొలగించి వివాదాలకు తెరలేపారు. వివరాల్లోకెళ్తే.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలగా  కొనసాగుతున్న పేరును మార్చాలని టీడీపీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు బుధవారం వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావును కోరారు.

వారు కోరిన 24 గంటల్లోనే గురువారం క్రేన్‌ను రప్పించి ఇంజినీరింగ్‌ కళాశాలపై ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగించడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కళాశాలకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు తొలిగించడం దుర్మార్గ చర్య అని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. వర్సిటీల్లో లోకేశ్‌ రెడ్‌బుక్‌ అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. ఏఎన్‌యూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం గౌరవ అధ్యక్షుడు పంతగాని రమే‹Ù, అధ్యక్షుడు ఆసిఫ్, ఉపాధ్యక్షుడు పంతగాని చంద్‌ తదితరులు ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్‌ సెనేట్‌ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, నేటి పాలకులు డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు తొలగించటం బాధాకరమని వర్సిటీ మాజీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)