Breaking News

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి

Published on Sat, 07/06/2024 - 05:10

సాక్షి, అమరావతి: దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా ఘనంగా నిర్వహిద్దామని వైఎస్సార్‌­సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్‌ జయంతి రోజైన జూలై 8 (సోమవారం)న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మె­ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజక­వర్గ సమన్వయక­ర్తలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో రామకృష్ణారెడ్డి శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈసారి వైఎస్సార్‌ 75వ జయంతి అయినందున రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమాలపై ఇప్పటికే సమా­చారం అందించామని తెలిపారు. విగ్రహాలను సిద్ధం చేసి కింది స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యక­ర్తలు, అభిమానులు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. మళ్లీ పార్టీ చైతన్యవంతమై, ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ఇది తొలి అడుగులా ఉండాలని చెప్పారు. ఈ కార్య­క్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా ఆదేశించారని తెలిపారు.

వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే వైఎస్‌ జగన్‌
వైఎస్సార్‌ మరణించి 15 సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆయన ఆలోచనలనే సిద్ధాంతాలుగా చేసుకుని వైఎస్‌ జగన్‌  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని, ప్రజల్లో మమేక­మైన నాయ­కుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా నేర్చుకు­న్నా­మని తెలి­పారు. వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్‌ జగన్‌ ప్రజలతోనే మమేకమై ఉన్నారని, పార్టీ కూడా ఎప్పుడూ ప్రజలతోనే నడిచిందని వివరించారు. 

వైఎస్సార్‌ మొదలు పెట్టిన పథకాలకు వైఎస్‌ జగన్‌ గత 5 ఏళ్లలో పూర్తి రూపం ఇవ్వడమే కాకుండా, వాటికి మరిన్ని జోడించి వ్యవస్థల్లో మంచి మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో తొలిసారి వైఎస్‌ జగన్‌ పేదరి­కాన్ని పారదోలి, అందరికీ సమాన అవకాశాలను కలిగించేలా పేదలను చేయి పట్టుకుని నడిపిస్తూ, సుస్థిర­మైన అభివృద్ధి, అభ్యుదయం దిశగా రాష్ట్రాన్ని నడిపిన ఘన చరిత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీద­న్నారు. మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చిన మార్పులు కళ్ల ముందే కనపడుతున్నాయని తెలి­పారు. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుందని, ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. 

ఎప్పటికీ ప్రజలతో మమేకమై ఉంటాం
పథకాల లబ్ధిదారులంతా ఓటు రూపంలో మనకు అండగా నిలుస్తారనుకున్నామని, కానీ టీడీపీ మోసపూరిత, అమలు సాధ్యం కానీ హామీలను ప్రజలు నమ్మి ఉండొచ్చని, ఇతర కారణాలు కూడా తోడై ఈ ఫలితాలు వచ్చాయని సజ్జల అభిప్రాయ­పడ్డారు. పోలింగ్‌ అయిన వెంటనే టీడీపీ రాష్ట్రంలో భయో­త్పాతాన్ని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)