Breaking News

సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్‌

Published on Tue, 07/09/2024 - 04:26

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా­లను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్‌ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్‌ వైఎస్సార్‌.. వైఎస్సార్‌ అమర్‌ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.

ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్‌లు కట్‌చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ తదితరులు కేక్‌ కట్‌చేసి వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఇడుపులపాయలో..
ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళు­లర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విదేశాల్లోనూ ఘనంగా..
వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్‌ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్‌బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్‌ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌ చేశారు. 

తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌: డాక్టర్‌ ప్రదీప్‌ చింతా 
తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్‌ అని, మనసున్న మారాజు వైఎస్సార్‌కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్‌ లైఫ్‌ సెంటర్‌లోనూ వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్‌ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో కేక్‌ కట్‌చేసి దుప్పట్లు పంపిణీ చేశారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?