Breaking News

నెట్టింట అభిమానం.. మహానేత మురిసిపోయిన వేళ..

Published on Fri, 07/07/2023 - 19:46

ఈరోజు..  ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారాయి. 

ఏ గ్రామంలో చూసినా సచివాలయం కనిపిస్తోంది. 

ఏ గ్రామానికి వెళ్లినా కూడా 50 మందికి ఒక వాలంటీర్‌ కనిపిస్తాడు. 

మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో రూపురేఖలు మారిపోయిన ఇంగ్లీష్‌ మీడియం బడులు కనిపిస్తున్నాయి.. 

ఇంకో నాలుగు అడులేస్తే.. విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తోంది.. 

ఆ విలేజ్‌ క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించే డాక్టర్‌ కనిపిస్తున్నాడు..

దేశానికి  రైతన్న వెన్నెముక అయితే.. ఆ రైతన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థకు పల్లెలే కేంద్రాలయ్యాయి 

జగనన్న ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుతోనూ పల్లె మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 

నాడు జాతిపిత మహాత్మా గాంధీ.. మొన్న తండ్రి వైఎస్సార్‌ కలగంది.. నేడు జగనన్న సాధించిన  గ్రామ స్వరాజ్యం ఇది!


‘‘గ్రామాలు అన్నింటా గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది’.. మహాత్ముడు చెప్పిన మాటల్ని ఆ మహానేత కలగన్నాడు. కానీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. అయితే ఆ గ్రామ స్వరాజ్యం ఇప్పుడు.. తన బిడ్డ పాలనలో కనిపిస్తోంది. అందుకే ఆ దివంగత నేత మురిసిపోతున్నారు!. 

పల్లెలు దేశానికి పట్టుకోమ్మలు. గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం.. దేశం బాగుంటాయి. అందుకే పల్లె ప్రగతి ప్రధానంగా ప్రతీ అడుగు వేయాలని మహానేత తలిచారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. కానీ, గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చేయడం మాత్రం ఆ మహానేత బిడ్డ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమయ్యింది. 

జులై 8వ తేదీన వైఎస్సార్‌ జయంతి. కానీ, అంతకంటే ముందుగానే అభిమానుల కోలాహలం నెట్టింట కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘‘నేను కన్నకల.. నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ’’.. అంటూ దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరిట ఆ ఫొటో వైరల్‌ అవుతోంది.  

పల్లె ప్రగతిని కోరుకున్న వైఎస్సార్‌కు గౌరవ సూచీగా.. ఆయన జయంతిని ‘గ్రామీణ స్వరాజ్య దినోత్సవం’గా ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండడం గమనార్హం.

సీఎం వైఎస్‌ జగన్‌.. చెప్పాడంటే చేస్తాడంతే..

మాట ఇస్తే మడమ తప్పని నైజం.. పేరుతో పలకరింపు.. అన్నదాతల కోసం తాపత్రయం.. జనసంక్షేమమే ధ్యేయం.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమాగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపిన రూపం దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.  ఆయన గుణాలు పుణికిపుచ్చుకున్న బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు జనానికి పెద్ద బిడ్డ అయ్యాడు. జగనన్న సంక్షేమ పాలనలో ఆ మహానేత.. జనం చిరునవ్వు రూపంలో ఇంకా మనమధ్యే ఉన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)