Breaking News

సేవామూర్తి.. వైఎస్‌ జయమ్మ

Published on Sun, 01/25/2026 - 09:53

పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే అందరికీ అన్ని పంచి ఇచ్చిన అమ్మ వైఎస్‌ జయమ్మ. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్‌ జయమ్మ. 1999 ప్రాంతంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడు అన్నం పెట్టాలని భావించిన వైఎస్‌ జయమ్మ... అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలు అందుకున్నారు. 

అంతేకాకుండా 1995నుంచి 2000వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన ఆమె అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్‌ అవార్డుతోపాటు  పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.  వైఎస్‌ జయమ్మ తన జీవితాంతం నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. 2006 జనవరి 25న వైఎస్‌ జయమ్మ తుదిశ్వాస వదిలారు.  

వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్న కుటుంబ సభ్యులు 
దివంగత వైఎస్‌ రాజారెడ్డి సతీమణి వైఎస్‌ జయమ్మ 20వ వర్ధంతి కార్యక్రమాలు ఆదివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. వైఎస్‌ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్‌ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మహానేత వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్సార్‌ సోదరుడు వైఎస్‌ సు«దీకర్‌రెడ్డిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.  

 

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)