Breaking News

ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించి ఓటు వేయండి

Published on Sun, 05/12/2024 - 05:40

సాక్షి, అమరావతి: ‘అధికారంలో ఎవరుంటే మీకు మంచి జరిగిందో.. ఎవరుంటే ఈ మంచి కొనసాగుతుందో అనే విషయాన్ని ఆలోచించి.. కుటుంబసభ్యులందరితో కలిసి మాట్లాడుకొని ఓటు వేయండి’ అని ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి     వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విట్టర్‌)లో ఒక వీడియో పోస్టు చేశారు. ‘ఓటర్లకు ఒక్కటే ఒకటి అప్పీల్‌ చేస్తున్నా.

గతంలో నాకు ఓటు వేయని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఓటు వేయకపోవటానికి వారికి రకరకాల కారణాలు ఉండవచ్చు. కులం కావచ్చు.. వాళ్లకున్న పారీ్టల అఫిలియేషన్‌ కావచ్చు. ఏమైనా కారణాలు కావచ్చు.  వాళ్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే. ఒక్కసారి ఇంటికి వెళ్లి మీ భార్యతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉండే అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా మాట్లాడండి. 

చిన్న పిల్లలు కదా.. ఓటు లేదు కదా.. అని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో కూడా మాట్లాడండి. అందరితో మాట్లాడి.. ఎవ్వరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవ్వరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది? అనే ఒకే ఒక్క  అంశం మీ ఓటును గైడ్‌ చేసేదిగా ఆలోచన చేసి ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించారు.

ప్రలోభాలకు లొంగకండి
⇒ టీడీపీ కూటమి డబ్బులిచ్చినా.. ఓటు మాత్రం మనకే వేయండి
⇒ ప్రతి ఓటూ ముఖ్యమే... రెండు బటన్లూ ఫ్యాన్‌ గుర్తుపైనే నొక్కండి
⇒ ఓటర్లకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ వినతి  

సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రలోభాలకు లొంగకండి.. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి జరిగిన మంచిని కొల­మానంగా తీసుకోండి. తెలుగుదేశం కూటమి మిమ్మల్ని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తుంది. డబ్బులూ ఇస్తారు. డబ్బులు తీసుకున్నా... ఓటు మాత్రం మీకు మంచి చేసిన మీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే వేసి మీ బిడ్డ ప్రభు­త్వాన్ని ఆశీర్వదించండి. ‘ఫ్యాన్‌’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించండి అని ఓటర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యరి్థంచారు.

రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఖజానా నుంచి దోచేసిన డబ్బులు మనవేనని.. ప్రలోభపెట్టేందుకు ఆ నోట్ల కట్టలిస్తారని చెప్పారు. తీసుకున్నా... ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి.. మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ‘ఫ్యాన్‌’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)