Breaking News

వైఎస్‌ జగన్‌ వస్తున్నారని.. బాధితుల డిశ్చార్జ్‌!

Published on Thu, 01/09/2025 - 17:37

తిరుపతి: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు... బాధితుల్ని ఆగమేఘాల  మీద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తున్నారు.  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని  ఉన్న పళంగా డిశ్చార్జ్‌ చేసి వారి ఇళ్లకు తరలిస్తున్నారు. కాకపోతే దర్శనం పేరుతో బాధితుల్ని తరలిస్తున్నామనే సాకులు చెబుతున్నారు.  తొక్కిసలాటలో  తీ వ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని మళ్లీ ద ర్శనానికి  ఎవరైనా తీసుకెళ్తారా అని పలువురు  ప్రశ్నిస్తున్నారు. ఇదొక డ్రామా అంటూ మండిపడుతున్నారు.

అధికారుల ఓవరాక్షన్‌
తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్‌ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. 

పద్మావతి మెడికల్ కాలేజీ నుంచి క్షతగాత్రుల డిశ్చార్జ్

 

దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్‌ నిలదీస్తారనే భయంతోనే పాలక వర్గం ఈ చ ర్యలకు ఉపక్రమించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)