Breaking News

వర్షాల కారణంగా నలుగురు మృతి.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published on Sat, 09/20/2025 - 12:14

సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృత్యువాతపడ్డారు. వర్షం కారణంగా నలుగురు మృతిచెందడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై తాజాగా వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. రాయచోటిలో వర్షాల కారణంగా మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలచి వేసింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇక, రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృతిచెందారు. వరదనీటిలో కొట్టుకుపోయి షేక్ ముని, ఇలియాస్, గణేష్ అనే వ్యక్తులు మృతి చెందారు. నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని మాండవ్య నదిలో ఉన్న మురుగు కాలువలో బాలిక మృతదేహం లభ్యమైంది. నాలుగు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. రాయచోటిలో గతంలో ఎన్నడూ లేని విధంగా  భారీ వర్షాలు, వరదలు రావడంతోనే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత 30 ఏళ్లలో రాయచోటిలో ఇంతటి భారీ వర్షం ఎన్నడూ చూడలేదని తెలిపారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)