Breaking News

ట్రాక్టర్‌ బోల్తా.. కూలీల దుర్మరణం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published on Mon, 02/10/2025 - 05:39

ముప్పాళ్ల: ట్రాక్టర్‌ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకి చెందిన 20 మంది మహిళా కూలీలు ట్రాక్టర్‌పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని వారంతా ట్రాక్టర్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా బొల్లవరం సమీపంలోని కాలు­వ కట్టపై ట్రాక్టర్‌ ఒక్కసారిగా తిరగబడింది. ట్రాక్టర్‌లో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ట్రాక్టర్‌ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ (55), తేనేపల్లి పద్మ (48), చక్కెర మాధవి (30) అక్కడికక్కడే మృతి చెందారు.

మధిర సామ్రాజ్యం (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తెనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 15 మంది కూలీలకు  గాయాలయ్యాయి. మృతి చెందిన కూలీలంతా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వారే. మృతదేహలను పోస్టుమార్టం నిమి­త్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షత­గాత్రులను వైద్యశాలకు తరలించి చికిత్స అంది­స్తు­న్నారు. ఘటనా స్థలాన్ని ముప్పాళ్ల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అత్యంత బాధాకరం: వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆదివారం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు.  ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభు­త్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)