Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిస్థానం గెలవాలి.. వైఎస్‌ జగన్

Published on Thu, 07/23/2026 - 22:44

సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ పోటీ చేసి గెలవాల్సిందేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అన్నారు. ఈ రోజు (గురువారం)కోనసీమకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 

ఈ ఎన్నికలను కార్యకర్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని విజయమే లక్షంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు అనుగుణంగా క్యాడర్‌ను సన్నద్ధం చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల అంశమై పార్టీ ముఖ్యనాయకులంతా పూర్తి బాధ్యత తీసుకోవాలని గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు. పార్టీ కమిటీలకు ఆగస్టు 15 నుండి గుర్తింపు కార్డుల పంపిణీ  జరిపి కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. కమిటీలో ఉత్సాహవంతులు, చురుకైన నాయకులను తీసుకోవాలని నేతలకు సూచించారు. 

అనుబంధ విభాగాల ద్వారా పార్టీకి పటిష్ఠమైన నెట్‌వర్క్‌ ఏర్పడిందని కూటమి ‍ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో క్షేత్రస్థాయి సమస్యలను పార్టీ క్యాడర్‌కు వివరించాలని ప్రజలకు, కార్యకర్తలకు స్థానిక నాయకత్వం అందుబాటులో ఉండాలని సూచించారు.  సమస్య వచ్చినప్పుడు వెంటనే  స్పందించి అండగా నిలవాలన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా పార్టీ నాయకులు బూత్‌ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముసాయిదా జాబితా విడుదలతోనే ప్రక్రియ పూర్తయినట్లు భావించకూడదన్నారు. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే సమస్య లేవనెత్తి పరిష్కరించాలని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే  ఫారం-6 ద్వారా చేర్చించాలన్నారు. 

అనర్హుల పేర్లపై ఫారం-7 ద్వారా అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేసే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని సందేశం ప్రతి కార్యకర్తకు వెళ్లాలని వైఎస్‌ జగన్‌ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)