Breaking News

వేదన విన్నారు.. ఆదుకున్నారు 

Published on Wed, 03/06/2024 - 05:02

మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజన్‌ విశాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాకు చెందిన ముగ్గురు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆ ముగ్గురికీ తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను సమకూర్చగా.. రెవెన్యూ అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఎండాడకు చెందిన మద్దాల జ్యోతి సీఎంను కలిసి తన భర్త మద్దాల రాంబాబు బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నారని.. వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. పీఎం పాలెంకు చెందిన యు.ఉమాదేవి తన 15 ఏళ్ల కుమారుడు ప్రసన్నకుమార్‌ రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని.. సాయం చేయాలని సీఎంకు విన్నవించుకుంది. ఎండాడ సుభాష్‌ నగర్‌కు చెందిన బాసిత్తు వసంతకుమారి తన భర్త పెంటారావు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాధపడుతున్నారని మొరపెట్టుకుంది.

అలాగే తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆమె అభ్యర్థించింది. బాధితులందరికీ ఆర్థిక సాయం అందించటంతో పాటు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్‌ మల్లికార్జున తక్షణ చర్యలు చేపట్టారు. విశాఖ రూరల్‌ తహసీల్దార్, ఇతర అధికారులను బాధితుల ఇళ్ల వద్దకే పంపించి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేయించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)