Breaking News

మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి

Published on Wed, 07/09/2025 - 05:36

సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, కుమారుడు వైఎస్‌ జగన్, కోడలు వైఎస్‌ భారతీరెడ్డి, సోదరుడు వైఎస్‌ సు«దీకర్‌రెడ్డి, సమీప బంధువులు మహానేత విగ్రహానికి పూల మాలలు వేసి స్మరించుకొని నివాళులు అర్పించారు. పులివెందుల నుంచి వారు రోడ్డు మార్గాన ఉదయం 7.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్నారు. పాస్టర్లు బెనహర్‌ నరేష్ , మృత్యుంజయ, రత్నకుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

రెండు నిమిషాల పాటు మౌనం వహించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునా«థరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, డాక్టర్‌ సుధ, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్‌బాష, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, సమీప బంధువులు వైఎస్‌ యువరాజ్‌రెడ్డి, డాక్టర్‌ ఈసీ సుగుణమ్మ, వైఎస్‌ ప్రమీలమ్మ, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డితో పాటు అనంతపురం జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ కదిరి ఇన్‌చార్జ్‌ మక్బూల్‌బాషా తదితరులు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

 ‘వైఎస్సార్‌ అమర్‌ రహే.. మరుపురాని నేత వైఎస్సార్‌..’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇడుపులపాయకు తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులను వైఎస్‌ జగన్‌ పేరుపేరునా పలకరించారు. అనంతరం వైఎస్సార్‌ తనయ వైఎస్‌ షర్మిల నివాళులు అర్పించారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)