Breaking News

నేతాజీ జయంతి.. వైఎస్ జగన్ ఘన నివాళి

Published on Fri, 01/23/2026 - 11:25

సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి నేడు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాళుల్పించారు. 

స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశ‌భ‌క్తి,  ధైర్యం, పోరాట ప‌టిమ‌, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆద‌ర్శ‌నీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. 

భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో  అజరామర నాయకుడిగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు ముద్రపడింది. ఆయన జీవితం ధైర్యం, త్యాగం, దేశభక్తి అనే మూడు మూలస్తంభాలపై నిర్మితమైంది. ఒడిశా(పూర్వపు ఒరిస్సా)లోని కటక్‌లో 1897 జనవరి 23న ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే బోస్‌ అసాధారణ ప్రతిభను ప్రదర్శించేవారు. ఐసీఎస్‌ (Indian Civil Services) పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడం ఆయనకు నచ్చలేదు. అందుకే దేశ సేవే తన ధ్యేయమని భావించి.. ఆ ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, తరువాత ఫార్వర్డ్‌ బ్లాక్ అనే కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం కోసం కేవలం అహింసా మార్గం సరిపోదని భావించి, ఆయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ ఆలోచనతోనే ఆయన భారతీయ జాతీయ సైన్యం (INA)ని ఏర్పాటు చేసి, “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా(మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను)” అనే నినాదంతో ప్రజల్లో ఉత్సాహాన్ని రగిలించారు. బోస్‌ 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా చెబుతారు. అయితే ఆ ప్రచారంపై అనేక సందేహాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)