ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
బాల గంగాధర్ తిలక్కు వైఎస్ జగన్ నివాళి
Published on Thu, 07/23/2026 - 10:49
సాక్షి, తాడేపల్లి: నేడు స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్... బాల గంగాధర్ తిలక్కు నివాళి అర్పించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తిలక్ సాగించిన రాజీలేని పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని సాధించి తీరుతాను అనే నినాదంతో యావత్ భారత జాతిని స్వాతంత్ర్యోద్యమ బాటలో నడిపించిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని మేల్కొలిపి.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన రాజీలేని పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం. నేడు బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు’ అని పోస్టు చేశారు.
`స్వరాజ్యం నా జన్మహక్కు... దానిని సాధించి తీరుతాను` అనే నినాదంతో యావత్ భారత జాతిని స్వాతంత్ర్యోద్యమ బాటలో నడిపించిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని మేల్కొలిపి, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన రాజీలేని పోరాటం తరతరాలకు… pic.twitter.com/8u5y416NJ3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 23, 2026
Tags : 1