Breaking News

బాబుకి ఓపెన్‌ చాలెంజ్‌ విసిరిన వైఎస్‌ జగన్‌

Published on Thu, 11/14/2024 - 05:47

సాక్షి, అమరావతి: ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలు, మోసాల­పై ప్రశ్నించే స్వరం విన్పించకూడదనే దురా­లోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అక్రమంగా నిర్బంధిస్తున్నారని  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండి పడ్డారు. 

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయనను వ్యతిరేకించే వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరినీ అరెస్టు చేయడం లేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

» దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్‌ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి.. 49 మందిని అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్‌ మీడియా వేదికగా నేను పోస్ట్‌ చేస్తాను. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిస్తున్నా. ఎంత మందిపై కేసులు పెడతారో చూద్దాం. ఆ కేసులేవో నాతోనే మొదలుపెట్టండి.

 

»  ఒక వైపు చంద్రబాబు హయాంలో రాష్ట్రం కుదేలైపోయే పరిస్థితి కన్పిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రతీ వర్గాన్ని మోసం చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల పరిస్థితి ఎప్పుడూ చూడని విధంగా ఉంది. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారులపై ఈ ఐదు­న్నర నెలల్లోనే అత్యాచారాలు, లైంగిక దాడ­ులు జరిగాయి. 

» ఇందులో 11 మంది చని­పోయారు. నిన్న (మంగళవారం) కూడా మూడు ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో ఐదున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు.. 500కు పైగా హత్యాయ­త్నాలు జరిగాయి. మహిళలపై అన్యాయా­లు, అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది.

ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం

»  బడ్జెట్‌ చూస్తే మోసం.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బకాయిలు రూ.2,300 కోట్లు దాటాయి. వాళ్లు రోడ్డెక్కుతున్నారు. పట్టించుకోవడం లేదు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు. అతలాకుతలమైపోయిన పరిస్థితుల్లో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ మోసం.. ఇలాంటి పరిస్థితులను నిలదీస్తే.. ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమంగా నిర్బంధిస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. 

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)