Breaking News

సమస్య విన్నారు.. ఆదుకున్నారు

Published on Thu, 02/22/2024 - 05:49

పెందుర్తి: ఆపన్నులను ఆదుకోవడంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అందె వేసిన చేయి. ఎవరైనా పేదలు వారి బాధను చెప్పుకొన్న వెంటనే స్పందిస్తారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. బుధవారం విశాఖకు వచ్చిన సీఎం జగన్‌ ఇదే విధంగా మెదడులో గడ్డతో బాధ పడుతున్న ఓ బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన సాలాపు నూక­రాజు, సత్యకళ దంపతుల కుమారుడు లీలాధర్‌­నాయుడు (10)కు చిన్న వయసులోనే మెదడులో క్యాన్సర్‌ గడ్డ ఏర్పడింది. వయసు పెరిగేకొద్దీ అది పెరిగి గొంతు వరకు వచ్చింది. స్థానిక ఆస్ప­త్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో బెంగుళూరులోని నిమ్‌­హాన్స్‌ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ మందుల ఖర్చు ఎక్కువ­య్యే పరిస్థితి ఉంది.

బుధ­వా­రం చినముషిడివాడ వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌­ను నూకరాజు, సత్యకళ దంపతులు కలిశారు. వారి కుమారుడి పరిస్థితిని వివరించారు. సమ­స్యను సావధానంగా విన్న సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునను ఆదేశించారు. అధికారులు వెంటనే చెక్‌ను సిద్ధం చేశారు. ఎమ్మె­ల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావు ఆ చెక్‌ను బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు.

సీఎం ఎంతో మేలు చేశారు బాలుడి తల్లి సత్యకళ
మా కుమారుడి పరిస్థితిని చెబుతుంటే సీఎం జగనన్న చలించిపోయారు. వెంటనే మాకు ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్‌కి చెప్పారు. తక్షణమే రూ.లక్ష మాకు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ చేతుల మీదుగా ఇచ్చారు. సీఎం జగనన్న మాకు ఎంతో మేలు చేశారు. ఆయన మేలు ఎన్నటికీ మరచిపోలేం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)