Breaking News

అభిమాన జన సందోహాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ..

Published on Tue, 02/04/2025 - 02:59

సాక్షి, అమరావతి/గన్నవరం: విదేశీ పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో అరెస్ట్‌ అయ్యి.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొని పోరాడదామని భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు­న్నారు. విమానాశ్రయం నుంచి తాడేపల్లి బయలు­దేరిన వైఎస్‌ జగన్‌కు మార్గం మధ్యలో ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు తదితర కూడళ్లలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోట్లు,  ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి నేతృత్వంలో కార్యకర్తలు,  అభిమానులు పూల వర్షం కురిపించారు.

వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు
తాడేపల్లిలోని శ్రీ ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఎండీ, వైఎస్సార్‌సీపీ నేత కొండా సూర్యప్రతాప్‌ రెడ్డి వివాహ వేడుక సోమవారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు పరిమళ రెడ్డి, సూర్యప్రతాప్‌ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)