Breaking News

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం

Published on Sat, 10/14/2023 - 04:35

సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు.

దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్‌ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)