Breaking News

శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు!

Published on Fri, 03/15/2024 - 05:11

కర్నూలు (సెంట్రల్‌): శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 87 ఏళ్లుగా జరుగు­తున్న అన్యాయాన్ని సరిదిద్ది సహేతుక న్యాయం చేసేందుకు డీ సెంట్రలైజేషన్‌ (పరిపాలనా వికేంద్రీకరణ) విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని, రాష్ట్ర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్‌ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోకాయుక్త చైర్మన్‌ జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంథాత సీతారామమూర్తితో కలసి న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. న్యాయ విశ్వ విద్యాలయం నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ 87 ఏళ్ల క్రితం సహేతుక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు శ్రీబాగ్‌ ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అప్పటి నుంచి అమలు కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు.


లా యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకం వద్ద సీఎం జగన్‌  

1937లో కుది­రిన శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు ఆ రోజుల్లోనే హై­కోర్టును ఇక్కడే నెలకొల్పుతారని భావించారని చెప్పారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యా­లయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే నెలకొల్పే సామర్థ్యాన్ని లా యూని­వర్సిటీ సంతరించుకుంటుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. త్వరలోనే వర్సిటీ నిర్మాణ పనులను చేపట్టి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

కర్నూలుకు మరిన్ని న్యాయ సంస్థలు
కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంతోపాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్‌ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్‌ కమిషన్, ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునళ్లను కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో ఆయా కమిషన్‌లు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థలన్నింటికీ జగన్నాథగట్టుపైనే భవన సముదాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ ప్రజల ఆ­కాంక్షకు ప్రతీకగా జాతీయ న్యాయ విశ్వ విద్యా­లయం నిలుస్తుందని, సీమ అభివృద్ధికి ఇది మచ్చు తునక లాంటిదని కలెక్టర్‌ సృజన పేర్కొన్నారు.

తుంగభద్రలో కాలుష్య విముక్తికి రూ.131.84 కోట్లు
కర్నూలు నగర పాలకసంస్థలో అమృత్‌ 2.0 పథకం కింద రూ.131.84 కోట్లతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రాంబొట్ల దేవాలయం, మామిదాలపాడు, మున­గాలపాడు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల­ను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తుంగభద్ర నదికి మురుగునీరు, కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ జిల్లా చైర్మన్‌ కరణం కిశోర్‌కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ విజయమనోహరి, జేసీఎస్‌ జిల్లా అధ్యక్షుడు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం జగన్‌
శ్రీబాగ్‌ ఒడంబడికలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడే (కర్నూలు) హైకోర్టు పెడతామని చెప్పారు. ఈమేరకు ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాల్సింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసినందున అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోతుండటంతో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈరోజు మన అడుగులు ముందుకు పడుతున్నాయి.    – సీఎం జగన్‌

కర్నూలు సమగ్ర నీటి సరఫరాకు రూ.115 కోట్లు
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కొరతను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. రూ.115 కోట్లతో అమృత్‌ 2.0 పథకం ద్వారా సమగ్ర నీటి సరఫరాకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాథగట్టు వద్ద ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, సర్వీసు రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్‌ విభాగాల ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. శుద్ధి అయిన నీటిని అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారు. రోజుకు 50 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) నీటిని శుద్ధి చేసేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అగ్రకుల పేదలను గుర్తించిన ఏకైక సీఎం జగన్‌
అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని గు ర్తించి మేలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. గత ఎన్నికలకు ముందు నా భర్త మరణించగా వితంతు పింఛన్‌ అందలేదు. 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు పింఛన్‌ మంజూరైంది. ఈబీసీ నేస్తం ద్వా­రా నాకు రూ.45 వేల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో మా అమ్మకు వృద్ధాప్య పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరిగాం. ఇప్పుడు ఇంటివద్దే వలంటీర్‌ వచ్చి పింఛన్‌ ఇస్తున్నారు. 
–  పద్మావతి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, బనగానపల్లె 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)