అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఆర్సీబీకి హృదయపూర్వక శుభాకాంక్షలు: వైఎస్ జగన్
Published on Wed, 06/04/2025 - 07:43
సాక్షి, గుంటూరు: అభిమానుల పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టీం ఐపీఎల్ కప్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ విజయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆ జట్టు ట్రోఫీని ఎత్తిన ఫొటోతో తన సందేశం ఉంచారు.
Heartfelt congratulations to #RCB on creating history in #IPL2025! A long awaited moment for millions of fans across the world. pic.twitter.com/CeDobHFMoK
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025
Tags : 1