విశాఖ మత్స్యకారుల గల్లంతుపై వైఎస్‌ జగన్‌ ఆందోళన

Published on Sun, 07/05/2026 - 12:55

సాక్షి,తాడేపల్లి: విశాఖ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల సముద్రంలో మత్స్యకారుల బోటు నిలిచిపోవడం, ఆ తర్వాత వారితో సంబంధాలు తెగిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు

గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, మెరైన్ పోలీసు విభాగాలను సమన్వయం చేసుకుంటూ రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైతే గాలింపు చర్యల కోసం అదనపు నౌకలను, హెలికాప్టర్లను కూడా వినియోగించి, మత్స్యకారులను ప్రాణాలతో తిరిగి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)