Breaking News

తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Thu, 01/09/2025 - 18:33

తిరుపతి : పద్మావతి మెడికల్‌ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) బాధితుల్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని, ఘటన వివరాలను  అడిగి తెలుసుకున్నారు వైఎస్‌ జగన్‌.
 
వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తిరుపతికి బయల్దేరిన సంగతి తెలిసిందే. కాసేపట్లో పద్మావతి మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్న తరుణంలో వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

తిరుచానూరు క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.  అరగంట తర్వాత వెళ్లాలని పోలీసులు చెప్పడంతో..  తిరుచానూరు క్రాస్‌ వద్ద తన బుల‍్లెట్‌ ప్రూఫ్‌ వాహనం వదిలి  నడుచుకుంటూనే  కాలినడకన బయల్దేరారు జగన్‌.. అయితే కొద్ది దూరం నడిచిన వెళ్లిన వైఎస్‌ జగన్‌.. ఆపై స్థానిక నేత కారులో తిరుపతికి బయల్దేరారు.

వైఎస్‌ జగన్‌ వెళ్లే లోపు బాధితుల్ని తరలించే యోచనలో ఉన్న అధికారులు..  దానిలో భాగంగా  ఆయన కాన్వాయ్‌ను  అడ్డుకున్నట్లు  తెలుస్తోంది. ఆ  క్రమంలోనే అరగంట, గంట అంటూ ఏవో ​ సంబంధం లేని కారణాలను తెలియజేసే యత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని వైఎస్‌ జగన్‌.. బాధితుల్ని పరామర్శించడానికి బయల్దేరారు.

కనీసం ట్రాఫిక్‌ క్లియర్‌ చేయని అధికారులు
వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న అధికారుల్లో ఎలాగైనా బాధితుల పరామర్శను నిర్వీర్యం చేయాలనే యోచన ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం ట్రాఫిక్‌ కూడా క్లియర్‌ చేయడం లేదు అధికారులు.  వైఎస్సార్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజాలు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రమంలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన వైఎస్‌ జగన్‌.. ఆపై స్థానిక నేత వాహనంలో తిరుపతికి బయల్దేరి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)