Breaking News

అడుసుమిల్లి కుటుంబానికి జగన్‌ పరామర్శ

Published on Sat, 09/21/2024 - 12:52

గుంటూరు, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

జయప్రకాష్‌ కుమారుడు తిరుమలేష్‌తో శనివారం వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ శాసనసభ్యులుగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్రవేసుకున్నారని జగన్‌ అన్నారు. జయప్రకాష్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

అడుసుమిల్లి జయప్రకాశ్‌(72) ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను1952లో ఈయన జన్మించారు. భార్య పద్మ, కుమారుడు శ్రీతిరుమలేష్, కుమార్తె సాయినందన ఉన్నారు. 1983-1985 మధ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా అడుసుమిల్లి కొనసాగారు.  రాష్ట్రవిభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)