Breaking News

ఇస్రో సెంచరీ.. ఏపీకి గర్వకారణం: వైఎస్‌ జగన్‌

Published on Wed, 01/29/2025 - 08:06

గుంటూరు, సాక్షి: శ్రీహరికోట నుంచి వందో రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన వేళ.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అభినందనలు  తెలియజేశారు. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

భారత అంతరిక్ష పరిశోధనలకు ముఖద్వారంగా మారిన శ్రీహరికోట ఏపీలో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో అత్యున్నతమైందని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగంతో భారతదేశ ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారాయన. భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారాయన. 

శ్రీహరికోట నుంచి ఈ ఉదయం ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివెరిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)