Breaking News

పెనుగొండ.. మట్టి నుంచి ఎదిగిన మాణిక్యం: వైఎస్‌ జగన్‌

Published on Wed, 12/18/2024 - 21:55

గుంటూరు, సాక్షి: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.

గుంటూరులో న్యాయవాదిగా పని చేస్తూ,  అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారని,  ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సాహితీ విమర్శ కేటగిరీలో తన రచనకు జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకోవడం స్ఫూర్తిదాయకమని జగన్‌ అన్నారు.

1972లో సమిథ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ మట్టి నుంచి ఎదిగిన మాణిక్యంగా ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న లక్ష్మీనారాయణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తన సందేశంలో జగన్‌ పేర్కొన్నారు.

పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన ప్రస్తుతం గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.  1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది.. అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)