కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్
Breaking News
రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: వైఎస్ జగన్
Published on Sat, 06/08/2024 - 09:44
సాక్షి, తాడేపల్లి: రామోజీరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024
గవర్నర్ సంతాపం..
రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Tags : 1
