లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు

Published on Tue, 09/24/2024 - 05:23

ఏలూరు (టూటౌన్‌): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్‌.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.

విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్‌ పవన్‌కుమా ర్‌ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్‌ పవన్‌కుమార్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్‌ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

విచారణలో పుట్ట సతీష్‌ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు.  ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్‌ సత్తార్, బీఎస్‌కే నాగూర్‌ హుస్సేన్‌ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)