Breaking News

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో యువతోత్సాహం

Published on Fri, 07/18/2025 - 05:11

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ యువతీ యువకులు జాతీయ సగటును మించి ముందున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 15–24 సంవత్సరాల్లోపు యువతలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించగల సామర్థ్యం ఎంత శాతం మందికి ఉందనే వివరాలను కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమగ్ర మాడ్యులర్‌ సర్వే:టెలికాం–2025 వెల్లడించింది.

కంప్యూటర్‌ లేదా మొబైల్‌ వంటి పరికరాలతో లావాదేవీలు నిర్వహించే సామర్థ్యంపై ఈ సర్వే జరిగింది.  ఇందులో.. రాష్ట్ర గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత మిగతా చాలా రాష్ట్రాల కంటే ముందున్నట్లు తేలింది. కేరళ తొలిస్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలోనూ ఉంది. కేరళలో 88.8 శాతం మంది.. తెలంగాణలో 88.4 శాతం, ఏపీలో 85.3 శాతం మందికి ఈ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించడంలో సామర్థ్యం ఉంది.  

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా.. 
ఇక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల పురుషుల్లో 89.7 శాతం.. మహిళల్లో 77.3 శాతం మందికి ఈ సామర్థ్యం ఉంది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఇది 83.6 శాతంగా ఉంది. అదే జాతీయ స్థాయిలో చూస్తే.. గ్రామీణ ప్రాంతాల పురుషుల్లో 73.3 శాతం, మహిళల్లో 51.4 శాతంగా ఉంది. మొత్తం మీద జాతీయ స్థాయిలో గ్రామాల్లోని మొత్తం 62.7 శాతం మంది యువతకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో సామర్థ్యం ఉంది. మరోవైపు.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 90.5 శాతం పురుషులకు.. మహిళల్లో 87.0% మందికి ఈ సామర్థ్యం ఉంది. మొత్తం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చూస్తే 88.6 శాతం యువత ఈ విషయంలో సమర్థులుగా తేలింది.  

రాష్ట్రంలో జాతీయ సగటును మించి.. 
జాతీయ సగటు విషయానికొస్తే.. 60.5 శాతం మంది పురుషులకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సామర్థ్యం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 66.6 శాతంగా ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో 37 శాతం మహిళలకు.. ఆంధ్రప్రదేశ్‌లో 43.2 శాతం మహిళలకు ఈ సామర్థ్యం ఉంది. మొత్తం కలిపి జాతీయ స్థాయిలో యువతకు 48.9 శాతం మందికి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 54.6 శాతంగా ఉంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)