Breaking News

Kotamreddy Sridhar Reddy: మాటిచ్చాడు.. కంటిచూపు తెప్పించాడు..

Published on Thu, 05/12/2022 - 08:00

సాక్షి, నెల్లూరు రూరల్‌: ఆ యువతికి పేదరికం శాపంగా మారడంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా కంటి చూపులేక నరకం చూసింది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో ఆ యువతి నేడు రంగుల ప్రపంచాన్ని ఆనందంగా చూస్తోంది. వివరాలిలా ఉన్నాయి.

నెల్లూరు రూరల్‌ మండలం పాత వెల్లంటి గ్రామం అరుంధతీయవాడకు చెందిన బైరపోగు శీనయ్య, రత్నమ్మ కుమార్తె బి.కామక్షమ్మ (20) పుట్టుకతో అంధురాలు. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే పాత వెల్లంటికి వెళ్లారు. అరుంధతీయవాడలో పాదయాత్ర చేస్తుండగా కామాక్షమ్మ కంటిచూపు లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో ఖరీదైన వైద్యం చేయించి కంటిచూపు తెప్పిస్తాని హామీ ఇచ్చారు. ఈక్రమంలో నగరంలోని మోడరన్‌ ఐ హాస్పిటల్‌లో వైద్యులు కొద్దిరోజుల క్రితం కామాక్షమ్మ ఒక కంటికి ఆపరేషన్‌ చేసి కంటి చూపును తెప్పించారు.

చదవండి: (రహదారులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..)

తిరిగి రెండో కంటికి బుధవారం ఆపరేషన్‌ నిర్వహించగా విజయవంతమైంది. తనకు కంటి చూపు వచ్చిన వెంటనే రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చూడాలని కామాక్షమ్మ కోరారు. దీంతో రూరల్‌ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కామాక్షమ్మను పరామర్శించారు. తనకు కంటి చూపు వస్తుందనే నమ్మకం పూర్తిగా పోయిందని ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి ఆదుకున్నారని యువతి తెలిపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. ఒక్కమాటతో కొత్త జీవితాన్నిచ్చిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)