Breaking News

హాల్‌ టికెట్‌ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..

Published on Fri, 02/13/2026 - 08:20

తూర్పు గోదావరి జిల్లా:  పరీక్షలు రాసేందుకు హాల్‌ టికెట్‌ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్‌ మోమినా తన్వీర్‌ (21), సయ్యద్‌ అఫ్రీన్‌ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. 

శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్‌ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద టిప్పర్‌ ఢీకొనడంతో తన్వీర్‌ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్‌ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్‌లో చికెన్‌ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తనీ్వర్‌ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 

చెక్‌పోస్టు నిర్వహణ వల్లే..  
జాతీయ రహదారిలోని మలుపులో చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెక్‌పోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెక్‌పోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)