Breaking News

ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోండి

Published on Sun, 01/11/2026 - 03:09

సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్‌ /అల్లిపురం/ఒంగోలు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యా­ఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్‌ టీవీ, ఆంధ్రజ్యోతి  అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ అంకంరెడ్డి నారాయణ మూర్తి తదితరులు శనివారం తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

ఇదే విషయమై వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నాయకులతో కలిసి విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌లో అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్‌ వి.బి.రాజ్‌కమల్‌కు ఫిర్యాదు అందజేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు.. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ చట్టం, ఐపీసీ నిబంధనల ప్రకారం యాంకర్, యాజమాన్యం రాధాకృష్ణ, చర్చలో పాల్గొని విషం చిమ్మిన విశ్లేషకుల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.   

ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు 
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్‌ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్‌ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వక్రీకరించాయి. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే. 
– కొమ్మూరి కనకారావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, 
– అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు

ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం 
రామవరప్పాడు: విజయవాడ రూరల్‌ రామవరప్పాడు ఫ్లైఓవర్‌ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రధాన గేట్‌ వద్ద శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ వాఖ్యలను వక్రీకరించి, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏబీఎన్‌ డిబేట్‌­లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్‌ జగన్‌పై విషం కక్కడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశా­రు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)